ఏపీలో తాజాగా 4,570 కరోనా పాజిటివ్ కేసులు

16-01-2022 Sun 17:06
  • గత 24 గంటల్లో 30,022 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు
  • ఒకరి మృతి
  • ఇంకా 26,770 మందికి చికిత్స
AP Corona report and statistics
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 30,022 శాంపిల్స్ పరీక్షించగా... 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,028 కేసులు, గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 669 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,06,280 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,65,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 26,770 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,510కి పెరిగింది.