రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. క‌రోనా వేళ‌ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న కేసీఆర్

16-01-2022 Sun 11:52
  • రేపు మధ్యాహ్నం 2 గంటలకు స‌మావేశం
  • ఇప్ప‌టికే విద్యా సంస్థలకు సెల‌వుల పొడిగింపు
  • రేపు మ‌రిన్ని అంశాల‌పై చ‌ర్చ‌లు
ts cabinet meets tomorrow
తెలంగాణ‌లో విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ మ‌రోసారి విజృంభిస్తోన్న నేప‌థ్యంలో తీసుకోవాల్సిన మ‌రిన్ని చ‌ర్య‌ల‌పై రేపు కేబినెట్ భేటీ కానుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి  కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుందని తెలిపింది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... కరోనా తదితర విషయాల మీద కేబినెట్ లో చర్చించనున్నారని వివ‌రించింది.