‘ఆర్ఆర్ఆర్’ ధైర్యంతో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు: రామ్ చరణ్

16-01-2022 Sun 10:34
  • ఎంతో ధైర్యాన్నిచ్చింది
  • సినిమాను చూసే విధానాన్ని ఆర్ఆర్ఆర్ మారుస్తుంది
  • మున్ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాల్లో నటిస్తా
RRR Emboldens Me A Lot Says Ram Charan
వాయిదా పడకపోయి ఉంటే ఈపాటికి థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి చేస్తుండేది. బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసేది. అయితే, కరోనా మహమ్మారి రూపంలో మరోసారి సినిమా అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. అయితే ఇటీవల బాలీవుడ్ సినిమాలకు సంబంధించి రామ్ చరణ్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ ను ప్రస్తావించారు.

సినిమాలు, నటీనటులను ప్రేక్షకులు చూసే విధానాన్ని ‘ఆర్ఆర్ఆర్’ పూర్తిగా మార్చేస్తుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. మున్ముందు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆ సినిమా ఎంతో ధైర్యాన్నిచ్చిందని చెప్పారు. మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నారు.