Actress Bhama: నిద్రమాత్రలు మింగి మలయాళ ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం!

Actress Bhama denies suicide attempt
  • 2017 నాటి నటిపై వేధింపుల కేసులో తిరిగి ప్రారంభమైన విచారణ
  • ఆ భయంతో ఆత్మహత్యకు యత్నించిందని వార్తలు
  • కొట్టిపడేసిన నటి భామ.. పొరపాటున నిద్రమాత్రలు వేసుకున్నానని వివరణ
  • ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు

మాలీవుడ్ పాప్యులర్ నటి భామ ఆత్మహత్యకు యత్నించింది. 2017 నాటి నటిపై వేధింపుల కేసును పోలీసులు తిరిగి విచారిస్తుండడంతో భయపడిన ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు ప్రచారం జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆమె కొచ్చి ఆసుపత్రిలో చేరడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.

అయితే, ఈ వార్తలను భామ కొట్టిపడేసింది. పొరపాటున అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని పేర్కొంది. తాను ఆత్మహత్యకు యత్నించినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని పేర్కొంది. మలయాళం చిత్రపరిశ్రమలో భామ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది. లోహిత‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నైవేద్యం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు ద‌క్షిణాది చిత్రాల్లోనూ న‌టించింది. జనవరి 2020 లో వ్యాపార‌వేత్త అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు బ్రేక్ చెప్పింది.

  • Loading...

More Telugu News