Haridwar: విద్వేష ప్రసంగం కేసు: యతి నర్సింగానంద్ అరెస్ట్

Yati Narsinghanand arrested by Uttarakhand Police in Haridwar hate speech case
  • గాంధీపై అనుచిత వ్యాఖ్యలు
  • గాడ్సేను దేవుడంటూ కీర్తించిన యతి నర్సింగానంద్
  • ఈ కేసులో ఇది రెండో అరెస్ట్
మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, గాడ్సేను దేవుడిగా  కీర్తించిన యతి నర్సింగానంద్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో నర్సింగానంద్ మాట్లాడుతూ.. గాంధీని చెత్తకుప్పతో పోల్చారు. మహాభారతంలోని కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.

తనను చుట్టుముడుతున్న విమర్శలపైన స్పందించిన నర్సింగానంద్.. తన వ్యాఖ్యలు తప్పయితే ఉరితీయాలని, అలా చేస్తే త్యాగంలా భావిస్తానంటూ మంగళవారం ఓ వీడియోను కూడా విడుదల చేశారు. గాంధీ చేసిన ద్రోహం వల్ల 100 కోట్ల మంది భారతీయులు భారత్‌ను తమ ఇల్లుగా చెప్పుకోలేకపోతున్నారని, తన దృష్టిలో గాంధీ ఓ చెత్త కుప్ప అని, ఆయనను చంపిన గాడ్సే దేవుడని అన్నారు.

కాగా, విద్వేష వ్యాఖ్యల కేసులో ఇది రెండో అరెస్ట్. వాసిమ్ రిజ్వి అలియాస్ జితేందర్ త్యాగిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జితేందర్ పెట్టుకున్న బెయిలు దరఖాస్తును నిన్న కోర్టు కొట్టివేసింది. జితేంద్ర త్యాగి అరెస్ట్‌కు నిరసనగా హరిద్వార్‌లో ధర్నాకు దిగిన యతి నర్సింగానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో యతి నర్సింగానంద్ సహా పదిమందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Haridwar
Yati Narsinghanand
Uttarakhand
Hate Speech

More Telugu News