YV Subba Reddy: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

YV Subbareddy explains Chiranjeevi meeting with CM Jagan
  • ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ
  • వైసీపీ రాజ్యసభ టికెట్ ఆఫర్ అంటూ కథనాలు
  • ఖండించిన చిరంజీవి
  • సినిమా టికెట్ల అంశం మాట్లాడారన్న వైవీ
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కావడం రాజకీయ రంగు పులుముకోవడం తెలిసిందే. దీనిపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించేందుకే చిరంజీవి సమావేశమయ్యారని స్పష్టం చేశారు. ఈ విషయంపై జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి కూడా ఖండించారని వైవీ తెలిపారు. అయినా, ఎవరికీ పిలిచి రాజ్యసభ టికెట్ ఇచ్చే అవసరం వైసీపీకి లేదని అన్నారు. పార్టీ బాగు కోసం కష్టపడేవాళ్లను సీఎం జగన్ గుర్తించి అవకాశం ఇస్తారని స్పష్టం చేశారు. జూన్ మాసంలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వైవీ వెల్లడించారు.
YV Subba Reddy
Chiranjeevi
CM Jagan
Cinema Tickets
Tollywood

More Telugu News