తెలంగాణలో మరో 1,963 మందికి కరోనా పాజిటివ్

Telangana corona update
  • గత 24 గంటల్లో 53,073 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,075 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 22,017 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 53,073 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 1,963 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,620 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,81,091 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 22,017 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,054కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Today Cases

More Telugu News