Sachin Joshi: సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ED attached actor businessman Sachin Joshi assets
  • టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన సచిన్ జోషి
  • నిర్మాతగానూ పలు చిత్రాల నిర్మాణం
  • ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో అక్రమాలపై ఈడీ దర్యాప్తు
  • రూ.410 కోట్ల విలువైన ఆస్తుల జప్తు
టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. మొత్తం రూ.410 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ వెల్లడించింది. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Sachin Joshi
ED
Assets
Viking Group
Omkar Group

More Telugu News