BJP: యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

BJP releases first list of assembly elections candidates
  • యూపీలో ఎన్నికల సందడి
  • ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
  • మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు
  • తొలి రెండు విడతల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత పెరిగింది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ  అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. తాజాగా తొలి జాబితా విడుదల చేసింది. 1, 2వ విడతల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే స్థానాన్ని కూడా నేడు ప్రకటించారు. ఆయన ఈ పర్యాయం గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. సీఎం పోటీ చేస్తున్న గోరఖ్ పూర్ అర్బన్ స్థానానికి ఆరో దశలో ఎన్నిక (మార్చి 3) జరగనుంది.
BJP
First List
Assembly Elections
CM Yogi Adityanath
Uttar Pradesh

More Telugu News