'ఖిలాడి' దుమ్మురేపేలానే ఉన్నాడే!

15-01-2022 Sat 11:21
  • 'ఖిలాడి'గా రవితేజ
  • ఆయన సరసన మీనాక్షి, డింపుల్
  • జనంలోకి వెళ్లిన దేవిశ్రీ పాటలు
  • వచ్చేనెల 11వ తేదీన సినిమా రిలీజ్  
Khiladi New Poster Released
రవితేజ కథానాయకుడిగా సత్యనారాయణ కోనేరు 'ఖిలాడి' సినిమాను నిర్మించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగు పరమైన విషయంలో జాప్యం జరిగింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తుందేమోనని కూడా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ లోకి దిగిపోయినట్టుగా కనిపిస్తున్న రవితేజ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ఈ పోస్టర్ చెప్పేస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో రవితేజ దుమ్మురేపేస్తాడనే విషయం అర్థమవుతోంది.

'రాక్షసుడు' హిట్ తరువాత రమేశ్ వర్మ జోనర్ మార్చుకుని చేసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి వదిలిన సాంగ్స్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇంతకుముందు మీనాక్షి .. తెరపై మెరిసినప్పటికీ, ఇదే ఇద్దరికీ ఫస్టు మూవీ అనుకోవాలి. ఈ సినిమా వాళ్ల కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.