సంక్రాంతి సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లు
- ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు
- మచిలీపట్నం, తిరుపతి, సికింద్రాబాద్ మధ్య
- నర్సాపూర్-వికారాబాద్ మార్గంలో రైళ్లు
నర్సాపూర్ నుంచి వికారాబాద్ కు రైలు సర్వీసు 16, 18వ తేదీల్లో రాత్రి 8.50 గంటలకు ఉంటుంది. కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు 16, 18వ తేదీల్లో రాత్రి 9 గంటలకు రైలు సర్వీసు ఉంటుంది. అలాగే, నర్సాపూర్ - వికారాబాద్ మధ్య 17వ తేదీ ఉదయం 10 గంటలకు జన్ సాధారణ రైలు, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు 16 రాత్రి 7 గంటలకు రైలు సర్వీస్ ను ఏర్పాటు చేసింది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు 17వ తేదీ రాత్రి 8.15 గంటలకు, కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు 17న రాత్రి 9 గంటలకు రైలు సర్వీసులు ఉంటాయి. అలాగే, మచిలీపట్నం - సికింద్రాబాద్ మార్గంలో 17, 19వ తేదీల్లో రాత్రి 8.50కు రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.