lic credit card: ఎల్ఐసీ పాలసీదారులకు ఉచిత క్రెడిట్ కార్డ్

  • జాయినింగ్ ఫీజులు, వార్షిక ఫీజుల్లేవు
  • చెల్లింపులను రుణాలుగా మార్చుకోవచ్చు
  • ప్రాసెసింగ్ ఫీజులు కూడా లేవు
  • ముందుగా క్లోజ్ చేసుకోవచ్చు
  • చెల్లింపులపై చక్కని రివార్డులు
Now you can Get Free LIC Credit Card

ఎల్ఐసీ తన పాలసీదారులు, ఏజెంట్లకు రెండు రకాల క్రెడిట్ కార్డులను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వీటిపై బోలెడన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. ఐడీబీఐ బ్యాంకు సహకారంతో ఎల్ఐసీ సీఎస్ఎల్ లుమిన్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సీఎస్ఎల్ ఎక్లాట్ సెలక్ట్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. రూపే ఆధారిత క్రెడిట్ కార్డులు ఇవి. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా ఎల్ఐసీకి ఉండడం తెలిసిందే.

ప్రస్తుతానికి ఎల్ఐసీ ఏజెంట్లు, పాలసీదారులు, సిబ్బందికే ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండగా.. త్వరలో అందరికీ ఆఫర్ చేయాలనే ప్రతిపాదనతో ఉంది. లుమిన్ కార్డుపై ప్రతీ రూ.100 వ్యయానికి మూడు డిలైట్ పాయింట్లు లభిస్తాయి. అదే ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై ప్రతీ రూ.100 వ్యయానికి 4 డిలైట్ పాయింట్లు (రివార్డు) పొందొచ్చు. పాలసీదారులు ఈ కార్డులతో ప్రీమియం చెల్లిస్తే ఆరు నుంచి పది పాయింట్లు వరకు అందుకోవచ్చు.

రూ.3,000 అంతకుమించి చేసే చెల్లింపులను 3 నుంచి 12 నెలల కాలానికి ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈ కార్డులపై ఉన్న ఆకర్షణీయమైన ప్రయోజనం.. ఈఎంఐ (రుణం)గా మార్చుకున్నందుకు ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు ఉండవు. అలాగే, రుణాన్ని ముందుగా తీర్చేసినా కానీ ప్రీ క్లోజర్ చార్జీలు పడవు. ప్రమాద బీమా కవరేజీ కూడా కార్డులపై లభిస్తుంది. వార్షిక ఫీజులు, జాయినింగ్ ఫీజులు అంటూ లేవు.

More Telugu News