తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. విద్యాసంస్థల సెలవుల పొడిగింపు?
- ఈ నెల 16తో ముగియనున్న సెలవులు
- ఈ నెల 20 వరకు పెంపు యోచనలో ప్రభుత్వం?
- పొడిగింపుకు ఆరోగ్య శాఖ అధికారులు కూడా సిఫార్సు
ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంటే అప్పటి వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సంక్రాంతి సెలవులను కూడా అప్పటి వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం తర్వాతే ఏ విషయమూ అధికారికంగా ప్రకటిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే, అదేదో త్వరగా ప్రకటిస్తే పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? లేదంటే సెలవులు ముగిసే వరకు అక్కడే ఉండాలా? అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు.