కేంద్ర టొబాకో బోర్డు సభ్యుడిగా జీవీఎల్ ఎన్నిక

14-01-2022 Fri 19:52
  • బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు అవకాశం
  • స్వయంగా వెల్లడించిన జీవీఎల్
  • పొగాకు రైతుల కోసం కృషి చేస్తానని వెల్లడి
GVL elected as Tobaco Board member
ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా కొనసాగుతున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా టొబాకో బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు. టొబాకో బోర్డు చట్టం 1975 ప్రకారం బోర్డులో ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉండాలని, ఆ విధంగా టొబాకో బోర్డులో రాజ్యసభ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని వివరించారు. ఇకపై పొగాకు సాగు చేసే రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని, పొగాకు ఎగుమతులు పెరిగేందుకు సహకారం అందిస్తానని జీవీఎల్ స్పష్టం చేశారు. కాగా, జీవీఎల్ నియామకంపై రాజ్యసభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.