Pawan Kalyan: చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే వేడుక మన సంక్రాంతి: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Telugu people Sankranti
  • సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన
  • రైతు విలసిల్లాలని ఆకాంక్ష
  • తెలుగువారికి భోగభాగ్యాలు అందించాలన్న పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు భోగి సందర్భంగా సోషల్ మీడియాలో తన సందేశం పంచుకున్నారు. భారతీయ పండుగలన్నీ ప్రకృతి, పర్యావరణ ఆధారిత సంబరాలేనని వెల్లడించారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ అని వివరించారు.

ప్రకృతిపరంగా చూస్తే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకుంటామని తెలిపారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న సౌభాగ్యవంతంగా విలసిల్లాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి తెలుగు వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని, భారతీయులందరికీ తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వివరించారు.

  • Loading...

More Telugu News