Pavan kalyan: 'వీరమల్లు'లో మోడ్రన్ లుక్ తోను పవన్ కనిపిస్తాడట!

  • 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్
  • మొగల్ కాలంలో నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • కథానాయికగా నిధి అగర్వాల్
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. కరోనా తీవ్రత తగ్గితే మళ్లీ షూటింగు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

ఈ కథ మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుందనీ, బందిపోటు పాత్రలో పవన్ కనిపిస్తాడని చెప్పారు. అందుకు తగినట్టుగానే పవన్ లుక్ ను వదిలారు. మొగల్ కాలానికి చెందిన భారీ సెట్స్ ను వేశారు. వాటిలో ఇంకా కాస్త చిత్రీకరణ జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ మోడ్రన్ లుక్ తోను కనిపిస్తాడనే విషయం బయటికి వచ్చింది.

ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. 'హీరో' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె, 'వీరమల్లు' గురించి ప్రస్తావించింది. ఈ కథ గతంలోను .. వర్తమానంలోను రెండు వేరు వేరు కాలాల్లో నడుస్తుందనీ, మోడ్రన్ లుక్ లోను పవన్ కనిపిస్తాడని చెప్పింది. ఈ విషయం ఇప్పుడు పవన్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More Telugu News