Chandrababu: హత్యకు గురైన టీడీపీ కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు

Chandrabau attends TDP worker funeral in Macherla constituency
  • మాచర్ల నియోజకవర్గంలో హత్య
  • గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు చంద్రయ్య మృతి
  • తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
  • చంద్రయ్య కుటుంబానికి పరామర్శ
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ క్యాడర్ ను భయాందోళనలకు గురిచేసేందుకు వైసీపీ రౌడీమూకలే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన వెల్దుర్తి మండలం గుండ్లపాడు వెళ్లారు. చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతేకాదు, చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాడె మోశారు. కాగా, చంద్రబాబు రాక నేపథ్యంలో గుండ్లపాడులో టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.
Chandrababu
Chandraiah
Murder
Macherla
TDP
Guntur District
Andhra Pradesh

More Telugu News