Raviteja: 'రావణాసుర'కి ముహూర్తం ఖరారు!

  • రవితేజ తాజా చిత్రంగా 'రావణాసుర' 
  • ఆసక్తిని పెంచిన టైటిల్ పోస్టర్ 
  • రేపు పూజా కార్యక్రమాలు 
  • దర్శకుడిగా సుధీర్ వర్మ
Ravanasura Movie Update

రవితేజ తాజా చిత్రంగా 'రావణాసుర' పట్టాలెక్కుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, ఈ నెల 14వ తేదీన లాంచ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే తెలియజేశారు. తాజాగా ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలుకానుందనే విషయాన్ని ప్రకటించారు. రేపు ఉదయం 9:51 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

'స్వామిరారా' సినిమాతో దర్శకుడిగా సుధీర్ వర్మ తొలి ప్రయత్నంతోనే విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చేసిన 'దోచేయ్' .. 'కేశవ' .. 'రణరంగం' ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'రావణాసుర' చేస్తున్నాడు. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది.

ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' విడుదలకి ముస్తాబవుతుండగా, 'రామారావు ఆన్ డ్యూటీ' ముగింపు దశకి చేరుకుంది. ఇక ఇటీవలే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' మొదలైంది. ఈ నేపథ్యంలోనే రవితేజ 'రావణాసుర'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఆయన కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

More Telugu News