కార్తి 'ఖైదీ' హిందీ రీమేక్ లో అజయ్ దేవగణ్!

13-01-2022 Thu 17:39
  • తమిళనాట హిట్ టాక్ తెచ్చుకున్న 'ఖైదీ'
  • తెలుగులోను భారీ వసూళ్లు 
  • హిందీ రీమేక్ కి సన్నాహాలు 
  • సెట్స్ పైకి వెళుతున్న అజయ్ దేవగణ్   
Khaidi Movie Hindi Remake
కొంతకాలం క్రితం వరకూ సౌత్ సినిమాలపై సల్మాన్ ఎక్కువ మక్కువను చూపేవాడు. సౌత్ లో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసే హీరోల్లో ముందుగా ఆయన పేరే వినిపించేది. అయితే ఇటీవల కాలంలో సౌత్ సినిమాల రీమేక్ లలో చేయడానికి అక్షయ్ కుమార్ .. అజయ్ దేవగణ్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.

తమిళంలో సూర్య చేసిన 'సింగం 3' సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అజయ్ దేవగణ్ నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతటి భారీ చిత్రాన్ని చేయడం కుదరదని భావించి, కార్తి చేసిన 'ఖైదీ' సినిమాను రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడు. తమిళంలో కొంతకాలం క్రితం కార్తి చేసిన ఈ సినిమా, తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టింది.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, బలమైన స్క్రీన్ ప్లే ప్రధానంగా నడుస్తుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ అనేవి కనిపించవు. అయినా ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అయితే ఈ కథకు ఎంటర్టైన్మెంట్ కూడా జోడించి, బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా అజయ్ దేవగణ్ మార్పులు చేస్తున్నాడని అంటున్నారు.