Ponnam Prabhakar: బీజేపీలోకి ఈటల రావడం బండి సంజయ్ కు ఇష్టం లేదు: పొన్నం

Bandi Sanjay didnt like Etela to come into BJP says Ponnam Prabhakar
  • బీజేపీలో అసంతృప్త కుమ్ములాటలు మొదలయ్యాయి
  • సంజయ్ కు వ్యతిరేకంగా కరీంనగర్ బీజేపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు
  • కేసీఆర్ ను ఏ ప్రాతిపదికన జైలుకు పంపిస్తారో సంజయ్ చెప్పాలి

బీజేపీలో ఐకమత్యం లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ బీజేపీలో అసంతృప్త కుమ్ములాటలు మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత ముదురుతాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కరీంనగర్ బీజేపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారని... ఈ సమావేశంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం సంజయ్ కు ఇష్టం లేదని అన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటున్నారని... ఏ ప్రాతిపదికన కేసీఆర్ ను జైలుకు పంపిస్తారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News