Chiranjeevi: సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటీ

Chiranjeevi meeting with CM Jagan concludes
  • ఇప్పటికీ అపరిష్కృతంగా టికెట్ల అంశం
  • సీఎం జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం
  • తాడేపల్లిలో నేడు సీఎంతో మెగాస్టార్ భేటీ
  • గంటన్నరపాటు సమావేశం
  • మరోసారి భేటీ కావాలని నిర్ణయం
సినీ రంగ సమస్యలపై ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఇరువురి భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. సినీ పరిశ్రమ సమస్యలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలని కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం కారణంగా సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారన్న విషయాన్ని చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సినీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

కాగా, చిరంజీవి ప్రస్తావించిన అన్ని అంశాలను సీఎం జగన్ నోట్ చేసుకున్నారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించే విధంగా చర్చలు, చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
Chiranjeevi
CM Jagan
Cinema Tickets Price
Tollywood
Andhra Pradesh

More Telugu News