నోట్లో బీడీ పెట్టుకుని 'పుష్ప‌'లా పోజు ఇచ్చిన రవీంద్ర జడేజా.. ఫొటో వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోట్లో బీడీ పెట్టుకుని 'పుష్ప‌'లా పోజు ఇచ్చిన రవీంద్ర జడేజా.. ఫొటో వైర‌ల్

jadeja as pushpa
  • 'పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ డైలాగు
  • గ‌తంలోనూ ఓసారి పుష్ప డైలాగు చెప్పిన జ‌డేజా
  • ధూమ‌పానం మంచిది కాద‌న్న జ‌డేజా
  • వాటిని తాను ప్రోత్స‌హించ‌డం లేద‌ని వ్యాఖ్య‌
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా మ‌రోసారి పుష్ప రాజ్‌లా త‌యారై ఫొటో పోస్ట్ చేశాడు. గ‌తంలో ఆయ‌న మాసిన గడ్డంతో 'పుష్ప' లుక్ లో.. 'పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ డైలాగు చెప్పి అల‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు నోట్లో బీడీ పెట్టుకుని అచ్చం పుష్ప రాజ్‌లా క‌న‌ప‌డ్డాడు.

దీనికి 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైరు' డైలాగును ఆయ‌న రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. అయితే, ధూమ‌పానం, పొగాకు న‌మ‌ల‌డం ఆరోగ్యానికి మంచిది కాదనీ, తాను వాటిని ప్రోత్స‌హించ‌డం లేద‌ని జ‌డేజా చెప్పాడు. గ్రాఫిక్స్ లో మాత్రమే ఈ ఫొటో రూపొందించామ‌ని వివ‌రించాడు.
 
హీరో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న 'పుష్ప' ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో అల‌రిస్తూ దూసుకుపోతోన్న విష‌యం తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబ‌డుతోంది. క్రికెట‌ర్లు కూడా ఈ సినిమాలోని పుష్ప లుక్‌కు ఫిదా అయిపోతున్నారు.
Ravindra Jadeja
Cricket
Pushpa

More Telugu News