ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్.. సినిమా టికెట్ల వివాదంపై చర్చించే అవకాశం!

13-01-2022 Thu 09:03
  • ఖరారైన సీఎం జగన్ అపాయింట్‌మెంట్
  • సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చిరు నిర్ణయం
  • ఈ భేటీ తర్వాత సమస్య పరిష్కారమవుతుందంటున్న టాలీవుడ్ వర్గాలు
Megastar Chiranjeevi to meet ap cm jagan today
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఈ మేరకు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల వివాదంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

సినిమా టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారని చెబుతున్నారు. జగన్-చిరంజీవి భేటీ తర్వాత సినిమా టికెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.