Muntjac: కాగజ్‌నగర్ అడవుల్లో 'మొరిగే జింక'.. కెమెరా కంటికి చిక్కిన అరుదైన వన్యప్రాణి!

Barking Deer appeared in Telangana after 15 Years
  • 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ కనిపించిన బార్కింగ్ డీర్
  • తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు కుక్కలా మొరిగి హెచ్చరికలు
  • దట్టమైన అటవీ ప్రాంతంలో ఆవాసం

తెలంగాణలోని కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కింగ్ డీర్‌నే ఇండియన్ మంట్‌జాక్ అని కూడా పిలుస్తారు. తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు ఇది కుక్కలా మొరిగి వాటిని హెచ్చరిస్తుంది. అందుకనే దీనిని మొరిగే జింక అని పిలుస్తారు.

ఇవి జనావాసాలకు చాలా దూరంగా, దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే నివసిస్తుంటాయి. ముఖ్యంగా దేశంలోని పశ్చిమ కనుమల్లో, హిమాలయాల సమీపంలో ఇవి కనిపిస్తుంటాయి. కాగా, 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో బార్కింగ్ డీర్ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ దీని జాడ లేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇది కనిపించడంతో అటవీ అధికారులతోపాటు వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News