Omicron: ఒమిక్రాన్ కథ ముగిసినట్టే.. బ్రిటన్, అమెరికాలో పీక్ కు చేరిన కేసులు.. తదుపరి ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి

Omicron may be headed for a rapid drop in US and Britain
షార్ట్స్‌లో చూడండి
కరోనా ఒమిక్రాన్ విషయంలో ఊరటనిచ్చే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్ రకం తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి, తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. అమెరికా, బ్రిటన్ లో కేసులు భారీగా పెరిగిపోవడం చూస్తున్నాం. అలాగే భారత్ లోనూ 2 లక్షల మేర రోజువారీ కొత్త కేసులు వస్తున్నాయి.

అయితే ఇది ఎంత వేగంగా విస్తరించిందో, అంతే వేగంగా తగ్గుముఖం పడుతున్నట్టు దక్షిణాఫ్రికా అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పుడు బ్రిటన్, అమెరికాలోనూ కేసులు గరిష్ఠాలకు (పీక్) చేరాయి. బ్రిటన్ లో ఇప్పటికే పీక్ కు చేరాయని, అమెరికాలోనూ ఇంచుమించు అదే స్థాయికి వచ్చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఎంత వేగంగా పాకిపోయిందో.. అంతే వేగంగా ఇది తగ్గుముఖం పట్టనుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో హెల్త్ మెట్రిక్స్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అలీమక్దాద్ అంటున్నారు.

ఇంకా చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడాల్సి ఉందని, కేసులు ఒక వారంలో పీక్ కు చేరొచ్చని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డైరెక్టర్ లారన్ ఆన్సెల్ మేయర్స్ పేర్కొన్నారు. జనవరి 19 నాటికి అమెరికాలో రోజువారీ కొత్త కేసులు 12 లక్షలకు చేరుకుని, వేగంగా తగ్గిపోతాయని అలీమక్దాద్ అంచనా వేశారు. బ్రిటన్ లో రోజువారీ 2 లక్షల కొత్త కేసులు రాగా, గత వారం వీటి సంఖ్య 1,40,000 వేలకు పడిపోవడం గమనార్హం. మరోవైపు తదుపరి కరోనా రకం ఎలా ఉంటుందోనన్న ఆందోళన అయితే ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రభుత్వాధినేతల మనసుల్లో నెలకొంది.
Go Back to Shorts
Omicron
cases rises
come down
experts

More Telugu News