'రౌడీ బాయ్స్' నుంచి సాంగ్ రిలీజ్!

12-01-2022 Wed 11:31
  • దిల్ రాజు నుంచి 'రౌడీ బాయ్స్'
  • హీరోగా ఆశిష్ రెడ్డి పరిచయం
  • కాలేజ్ నేపథ్యంలో నడిచే కథ
  • ఈ నెల 14వ తేదీన విడుదల
Rowdy Boys lyrical song released
టాలీవుడ్ లో నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరు ఉంది. ఇంతవరకూ ఆయన బ్యానర్ పై 50 సినిమాలు నిర్మితమయ్యాయి. అలాంటి దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్నాడు. 'రౌడీ బాయ్స్' పేరుతో ఆయన తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది.

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఏ జిందగీ ... ఓ యూనివర్సిటీ .. ఈ దోసితీ లేదంటే చీకటి' అంటూ ఈ పాట సాగుతోంది. కాలేజ్ లైఫ్ .. లవ్ .. ఫ్రెండ్షిప్ .. పార్టీలు .. సరదాలు .. సందళ్లకి సంబంధించిన విజువల్స్ తో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. రామ్ మిర్యాల ఆలాపనతో ఈ సాంగ్ అలరిస్తోంది. కాలేజ్ కి బంక్ కొట్టినప్పుడు .. ఫస్టు టైమ్ మందు కొట్టేటప్పుడు .. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయినప్పుడు నీ పక్కన ఉండేది ఫ్రెండ్ ఒక్కడే అనే అర్థంలో ఈ పాట నడుస్తోంది. యూత్ కి ఈ పాట బాగానే పట్టేసే ఛాన్స్ ఉంది.