lata mangeshkar: మ‌రో 12 రోజుల పాటు వైద్యుల ప‌రిశీల‌న‌లో ల‌తా మంగేష్క‌ర్

Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid19
  • లతా మంగేష్కర్‌ కు క‌రోనా
  • న్యూమోనియాతోనూ బాధ‌ప‌డుతున్న గాయ‌ని 
  • ఐసీయూలో కొన‌సాగుతోన్న చికిత్స‌
ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్‌ (92)కు క‌రోనా సోకడంతో ఆమెను ఇటీవ‌ల క‌టుంబ స‌భ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో చేర్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యులు వివ‌రాలు తెలిపారు. ఆమె ఐసీయూలోనే ఉన్నార‌ని, 10-12 రోజుల పాటు వైద్యుల ప‌రిశీల‌న‌లోనే ఉంటార‌ని చెప్పారు.

ఆమె కరోనాతో పాటు న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్నార‌ని వైద్యుడు ప్ర‌తీత్ సంధాని తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం ఆమెకు క‌రోనా నిర్ధార‌ణ అయింది. ల‌తా మంగేష్క‌ర్ 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుని కోలుకున్నారు.
lata mangeshkar
icu
Corona Virus

More Telugu News