మరో 12 రోజుల పాటు వైద్యుల పరిశీలనలో లతా మంగేష్కర్
- లతా మంగేష్కర్ కు కరోనా
- న్యూమోనియాతోనూ బాధపడుతున్న గాయని
- ఐసీయూలో కొనసాగుతోన్న చికిత్స
ఆమె కరోనాతో పాటు న్యూమోనియాతో బాధపడుతున్నారని వైద్యుడు ప్రతీత్ సంధాని తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. లతా మంగేష్కర్ 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుని కోలుకున్నారు.