Kodali Nani: కొవిడ్ బారిన కొడాలి నాని, వంగవీటి రాధా.. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిక

AP Minister kodali nani and tdp leader vangaveeti radha infected to corona
  • లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్న రాధాకృష్ణ
  • కరోనా సోకినట్టు నిర్ధారణ
  • కొడాలి నాని, రాధా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కరోనా బారినపడ్డారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. తనలో స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో అనుమానంతో రాధా కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన కూడా వెంటనే హైదరాబాద్ చేరుకుని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

రాధా ఈనెల 9న కృష్ణా జిల్లా కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, కొడాలి నాని, రాధా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Kodali Nani
Vangaveeti Radhakrishna
COVID19
AIG Hospital

More Telugu News