Pawan Kalyan: ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on alliances
  • కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్
  • జనసైనికులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్
  • వివిధ పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని వెల్లడి
  • జనసైనికులు ఒకేమాటపై ఉండాలని ఉద్బోధ

ఇటీవల రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై తమ వైఖరి వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జనసైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని వెల్లడించారు.

ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు.

  • Loading...

More Telugu News