Team India: కేప్ టౌన్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 223 ఆలౌట్

Team India all out in Cape Town test first innings
  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు
  • కేప్ టౌన్ లో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • కోహ్లీ 79 పరుగులు.. రబాడాకు 4 వికెట్లు
పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న కేప్ టౌన్ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పుజారా 43 పరుగులు చేయగా, పంత్ 27 పరుగులు చేశాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడా 4, మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీశారు. ఒలీవియర్, ఎంగిడి, మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆరంభంలోనే కెప్టెన్ డీన్ ఎల్గార్ (3) వికెట్ కోల్పోయింది. ఎల్గార్ ను బుమ్రా అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఐడెన్ మార్ క్రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు దక్షిణాఫ్రికా ఇంకా 206 పరుగులు వెనుకబడి ఉంది. 
Team India
First Innings
Cape Town
South Africa

More Telugu News