leg pain: పాదాల నుంచి మోకాలి వరకు నొప్పి.. కరోనా బాధితుల్లో ఇదొక లక్షణం!

  • గొంతులో దురద కూడా మరొక లక్షణం 
  • బెంగళూరులోని కరోనా బాధితుల్లో ఈ తరహ లక్షణాలు
  • రెండు మూడు రోజుల తర్వాత తగ్గుముఖం
Acute pain in legs is new symptom of corona

కరోనా ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పటి వరకు పెద్దగా వినని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కాళ్లల్లో విపరీతమైన నొప్పికి తోడు, గొంతులో దురద ఉందంటూ బెంగళూరు నగరంలోని బాధితులు తాజాగా వైద్యులకు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ కు గురి అయిన రెండు రోజుల తర్వాత నుంచి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.

బెంగళూరులో గడిచిన 24 గంటల్లో 9 వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి. ఇందులో 85 శాతం మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ స్క్వాడ్ కు తమ లక్షణాల గురించి తెలియజేస్తున్నారు. నొప్పికి కారణం ఏంటన్నది వైద్యులకు ఇంకా అంతుబట్టలేదు. స్వల్ప లక్షణాలున్న రోగులకే పాదాల నుంచి మోకాలి వరకు నొప్పి, గొంతులో దురద తదితర సమస్యలు కనిపిస్తున్నాయి.

గడిచిన కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు, విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు సైతం కరోనా పాజిటివ్ వచ్చిన ఒక్క రోజులోనే కాలిలో విపరీతమైన నొప్పి అని చెబుతున్నారు. గొంతులో దురద ఒక్కరోజు ఉంటోంది. కాలిలో నొప్పి మూడో రోజు నుంచి తగ్గుముఖం పడుతోంది’’ అని వాణి హాస్పిటల్ కు చెందిన డాక్టర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ అయిన ఆసిమా భాను తెలిపారు. గొంతు దురద ఉన్నవారు బెటాడిన్ లోషన్ తో గార్గిలింగ్ చేయాలని, కాలి నొప్పికి డోలో 650 మాత్ర వేసుకోవచ్చని డాక్టర్ భాను సూచించారు.

More Telugu News