Loan: లోన్ అప్లికేషన్ తిరస్కరించారట... ఏకంగా బ్యాంకుకే నిప్పంటించాడు!

Man sets bank on fire after his loan application rejected
  • కర్ణాటకలో చోటుచేసుకున్న ఘటన
  • డాక్యుమెంట్లు పరిశీలించి లోన్ తిరస్కరించిన బ్యాంకు అధికారులు
  • నిప్పంటించిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
లోన్ ఇచ్చేందుకు నిరాకరించారనే కోపంతో ఏకంగా బ్యాంకుకే నిప్పుపెట్టాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరీ ప్రాంతంలోని కగినెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఓ వ్యక్తికి డబ్బు అవసరం కావడంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకుని, దరఖాస్తు చేశాడు. అయితే డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అతనికి లోన్ ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి... బ్యాంకుకు నిప్పు అంటించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిందితుడిపై పోలీసులు ఐపీసీ 246, 477, 435 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Loan
Application Rejection
Bank
Fire

More Telugu News