తెరపై తండ్రీ కూతుళ్లుగా రాజశేఖర్, శివాని!

11-01-2022 Tue 11:49
  • మలయాళ రీమేక్ గా 'శేఖర్'
  • డిఫరెంట్ లుక్ తో రాజశేఖర్ 
  • కూతురి పాత్రలో శివాని
  • ఫిబ్రవరి 4న రిలీజ్ చేసే ఆలోచన    
Shivani in Rajasekhar Movie
రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో 'శేఖర్' సినిమా రూపొందుతోంది. 2018లో మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోజు జార్జ్ ప్రధానమైన పాత్రను పోషించాడు. రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న ఒక నలుగురు పోలీస్ ఆఫీసర్స్ కథ ఇది.

మలయాళంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అక్కడ ఈ సినిమాకి భారీ వసూళ్లతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. మలయాళంలో జోజు జార్జ్ పోషించిన పాత్రలో తెలుగులో రాజశేఖర్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు శివాని కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

తెరపై కూడా ఈ ఇద్దరూ తండ్రీకూతుళ్ల పాత్రల్లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. తాజాగా వదిలిన ఈ ఇద్దరి పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. డిఫరెంట్ లుక్ తో రాజశేఖర్ కనిపిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.