Nandamuri Balakrishna: తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బాలకృష్ణ సమావేశం

Nandamuri Balakrishna met Telangana Health Minister Thanneeru Harish Rao
  • హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ
  • బసవతారకం ఆసుపత్రి సేవలపై చర్చ
  • ప్రభుత్వ మద్దతు అవసరమన్న బాలకృష్ణ
  • సానుకూలంగా స్పందించిన హరీశ్ రావు
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కలిశారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్టు బాలకృష్ణ వెల్లడించారు. ముఖ్యంగా, తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను మంత్రికి వివరించినట్టు తెలిపారు.

ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని విజ్ఞప్తి చేశానని, గౌరవనీయ మంత్రి హరీశ్ రావు ఎంతో సానుకూలంగా స్పందించారని బాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో తనతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు కూడా పాల్గొన్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.
Nandamuri Balakrishna
Thanneeru Harish Rao
Basavatarakam Hospital
Hyderabad
Telangana

More Telugu News