Sonu Sood: కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూ సూద్ సోదరి మాళవిక

Sonu Sood siter Malvika Sachar joins Congress party
  • రాజకీయ రంగప్రవేశం చేసిన సోనూ సూద్ సోదరి
  • మోగాలో పంజాబ్ సీఎం సమక్షంలో పార్టీలో చేరిక
  • మోగా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
  • మోగా... సోనూ సూద్ స్వస్థలం
ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సచార్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాళవిక రాజకీయ రంగప్రవేశంపై కొన్నాళ్లుగా వార్తలు వస్తుండడం తెలిసిందే. మాళవిక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ స్వస్థలం మోగా నుంచే ఆమె బరిలో దిగే అవకాశాలున్నాయి.

 ఇవాళ మోగాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మోగాలో సోనూ సూద్ నివాసానికి వచ్చారు. సోనూ సూద్, మాళవికతో ఆయన చర్చలు జరిపారు.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సోనూ సూద్ ను పంజాబ్ ఐకాన్ గా తొలగించడం తెలిసిందే. సోనూ సూద్ సోదరి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఎస్ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను గతంలో సోనూ సూద్ కు అప్పగించింది. పంజాబ్ ఐకాన్ గా నియమించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
Sonu Sood
Malvika Sachar
Congress
Moga
Punjab

More Telugu News