'ఆచార్య' రోజునే 'శేఖర్' వచ్చేస్తాడట!

10-01-2022 Mon 18:57
  • విభిన్నమైన కథాంశంతో 'శేఖర్'
  • డిఫరెంట్ లుక్ తో రాజశేఖర్
  • దర్శకురాలిగా జీవిత
  • ఫిబ్రవరి 4వ తేదీన వచ్చే ఛాన్స్
Sekhar Movie Release on Feb 4th
రాజశేఖర్ కథానాయకుడిగా 'శేఖర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే .. దర్శకత్వ బాధ్యతలను జీవిత వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ లుక్ తో ఆమె ఈ సినిమాలో రాజశేఖర్ ను చూపించనున్నారు. రాజశేఖర్ ఫస్టులుక్ బయటికి వచ్చిన రోజునే మంచి మార్కులు పడిపోయాయి.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో జీవిత రాజశేఖర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అదే రోజున 'ఆచార్య' విడుదల కావలసి ఉంది. 'శేఖర్' ఆ రోజున రావాలని అనుకుంటున్నాడని అంటే, 'ఆచార్య' రాడనే విషయం తెలియడం వల్లనేనని అంటున్నారు.

నిజంగానే 'ఆచార్య' వైపు నుంచి ఎలాంటి హడావుడి లేదు. ఫిబ్రవరి నాటికి కేసులు పెరిగే అవకాశం ఉండటం వలన .. ముందుగా చెప్పిన రోజున 'ఆచార్య' వచ్చే అవకాశాలు తక్కువని అంటున్నారు. లాక్ డౌన్ లేకపోయినా, 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపితే వర్కౌట్ కాదు. అందువలనే 'ఆచార్య' నుంచి ప్రమోషన్స్ జోరందుకోవడం లేదని చెప్పుకుంటున్నారు.