ప్రభాస్, పూజా హెగ్డే 'రాధేశ్యామ్' వర్కింగ్ స్టిల్స్ పంచుకున్న దర్శకుడు

10-01-2022 Mon 15:54
  • విడుదల వాయిదా పడిన 'రాధేశ్యామ్'
  • కరోనా ప్రభావంతో వెనుకంజ
  • అభిమానుల కోసం ఫొటోలు పంచుకున్న రాధాకృష్ణ కుమార్
  • మరింత బలంగా మళ్లీ వద్దాం అంటూ ట్వీట్
Radhakrishna Kumar shares Radhe Shyam working stills
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా విజృంభణ లేకపోతే రాధేశ్యామ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అయ్యేది. జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ వర్కింగ్ స్టిల్స్ ను పంచుకున్నారు. ప్రభాస్, పూజా హెగ్డేలపై చిత్రీకరించిన సన్నివేశాల తాలూకు ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. "రాధేశ్యామ్ నుంచి డార్లింగ్ విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే)ల ఫొటోలు ఇవిగో. మనందరం కాస్త వెనక్కి తగ్గుదాం... అయితే మరింత బలంగా మళ్లీ వద్దాం" అని ట్వీట్ చేశారు.