Rakul Preet Singh: అవును.. అతనితో ప్రేమలో ఉన్నా: రకుల్ ప్రీత్ సింగ్

I am in love with Jackky Bhagnani says Rakul Preet Singh
  • బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నాను
  • చాలా కాలంగా ఇద్దరం డేటింగ్ లో ఉన్నాము
  • మా రిలేషన్ షిప్ గురించి ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు తెలుసు
తాను ప్రేమలో ఉన్నానని సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, తాను ప్రేమలో ఉన్నామని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తామిద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నామని చెప్పింది. తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఫేజ్ అని తెలిపింది. తమ రిలేషన్ షిప్ గురించి తమ ఇంటి సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసని చెప్పింది.

తామిద్దరిదీ ఒకే రంగమని, తమ ఆహారపుటలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని రకుల్ తెలిపింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడానికే తాము ప్రాధాన్యతను ఇస్తామని చెప్పింది. తామిద్దరికీ కుటుంబాలు చాలా ముఖ్యమని తెలిపింది. అయితే ఇప్పట్లో తాము పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెప్పింది. తన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని... వాటిని పూర్తి చేసిన తర్వాతే పెళ్లి అని తెలిపింది. తన ప్రేమ గురించి అందరికీ తానే చెప్పానని, పెళ్లి గురించి కూడా అందరికీ తానే చెపుతానని, మీకు తెలియకుండా పెళ్లి చేసుకోనని చెప్పింది.
Rakul Preet Singh
Love
Relationshop
Marriage
Bollywood
Tollywood

More Telugu News