Nalgonda District: నల్గొండ జిల్లాలో నరబలి కలకలం.. గుడి వద్ద మొండెం లేని తల స్వాధీనం

Human sacrifice in Nalgonda fears people
  • విరాట్ నగర్ మైసమ్మ ఆలయం వద్ద మొండెం లేని తల
  • నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం
  • ఆలయానికి వెళ్లేందుకు భయపడుతున్న భక్తులు

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నరబలి కలకలం రేగింది. విరాట్ నగర్ మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తల కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నరబలి ఇచ్చి మొండెం నుంచి తలను వేరు చేసి మొండాన్ని తీసుకుపోయి తలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.

ఆలయం వద్ద తలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆలయానికి వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు.

  • Loading...

More Telugu News