Corona Virus: కరోనాలో మరో కొత్త వేరియంట్.. డెల్టాక్రాన్ గా నామకరణం!

Corona new variant Deltacron
  • సైప్రస్ లో బయటపడ్డ డెల్టాక్రాన్
  • వేరియంట్ ను గుర్తించిన వైరాలజీ నిపుణుడు  
  • దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్న సైంటిస్టులు
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. ఓవైపు ఒమిక్రాన్ దెబ్బకు కేసులు అమాంతం పెరిగిపోతుంటే... మరోవైపు కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. సైప్రస్ లో ఈ వేరియంట్ బయటపడింది. దీనికి డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు.

అయితే ఈ కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. ఈ వేరియంట్ ను సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ గుర్తించారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ గురించి సైంటిస్టులు మాట్లాడుతూ... దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.
Corona Virus
Deltacron
New Variant

More Telugu News