America: న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం

19 dead in New York City apartment fire accident
  • ఈస్ట్ 81 స్ట్రీట్‌లోని 19 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఘటన
  • రెండు, మూడు అంతస్తుల్లో చెలరేగిన మంటలు
  • మరో 13 మంది పరిస్థితి విషమం
  • గత కొన్నేళ్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాన్ని చూడలేదన్న న్యూయార్క్ మేయర్
అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు 19 మందిని బలితీసుకున్నాయి. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈస్ట్ 81 స్ట్రీట్‌లోని 19 అంతస్తులున్న బ్రాంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.

రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఫలితంగా అపార్ట్‌మెంట్ మొత్తం పొగ వ్యాపించడంతో ఉపిరి తీసుకోవడం అపార్ట్‌మెంట్ వాసులకు ఇబ్బందిగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 19 మంది నిర్జీవంగా మారిపోయారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాన్ని తానెప్పుడూ చూడలేదని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
America
Newyork
Fire Accident

More Telugu News