నిర్ణయాత్మక మూడో టెస్టు కోసం టీమిండియా కఠోర సాధన... ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 11 నుంచి మూడో టెస్టు
- కేప్ టౌన్ లో మ్యాచ్
- సిరీస్ లో చెరో టెస్టు గెలిచిన టీమిండియా, దక్షిణాఫ్రికా
- కేప్ టౌన్ చేరుకున్న భారత ఆటగాళ్లు
ఎల్లుండి నుంచి జరిగే ఈ టెస్టు కోసం భారత్ ఇప్పటికే కేప్ టౌన్ చేరుకుంది. ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో ఆటగాళ్లు సాధన షురూ చేశారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో కసరత్తులు, నెట్ ప్రాక్టీసు చేశారు. కాగా, వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తూ కనిపించడం శుభపరిణామం అని చెప్పాలి.


