HM: ఆశీస్సుల కోసం వెళితే అత్యాచారం చేయబోయిన హెడ్ మాస్టర్

  • ములుగు జిల్లాలో ఘటన
  • కొత్తగా పెళ్లి చేసుకున్న పాఠశాల ఉద్యోగి
  • ఆశీస్సుల కోసం హెచ్ఎం వద్దకు వెళ్లిన వైనం
  • నవవధువుపై కన్నేసిన కామాంధుడు
  • భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
HM tries to assault newly married girl

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాంజపురంలో ఓ కీచక హెడ్ మాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పాఠశాల ఉద్యోగి పెళ్లి చేసుకున్నాడు. ఆశీస్సుల కోసం హెడ్ మాస్టర్ వద్దకు వెళితే, ఆ కామాంధుడు ఆ ఉద్యోగి భార్యపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ నవవధువు తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా ఈ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మహిళా హెచ్ఎంను నియమించాలని డిమాండ్ చేశాయి.

More Telugu News