ఏపీలో ఒక్కరోజులో 1200కి పైగా కరోనా కేసులు

09-01-2022 Sun 17:08
  • గత 24 గంటల్లో 38,479 కరోనా పరీక్షలు
  • 1,257 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 254 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,774 మందికి చికిత్స
AP sees huge rise in corona positive cases
ఏపీలో కరోనా ఉద్ధృతి మొదలైంది. భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 38,479 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,257 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 254 కేసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో 196, అనంతపురం జిల్లాలో 138, కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 104, నెల్లూరు జిల్లాలో 103 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,81,859 పాజిటివ్ కేసులు నమోదవగా... 20,62,580 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,774 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,505కి పెరిగింది.