Harish Rao: హైదరాబాదు చైతన్యపురిలో మాస్కుల్లేకుండా కనిపించిన మహిళలు... మాస్కులు ఇచ్చిన హరీశ్ రావు

Harish Rao gives masks to women in Chaitanyapuri
  • ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన హరీశ్
  • మంత్రి రాకతో సందడి
  • మాస్కుల్లేకుండా కనిపించిన మహిళలు
  • తన వద్ద ఉన్న మాస్కులు అందజేసిన హరీశ్
తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ హైదరాబాదు చైతన్యపురిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మంత్రి రాక నేపథ్యంలో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, హరీశ్ రావు కారు నుంచి దిగగానే పలువురు మహిళలు మాస్కుల్లేకుండా దర్శనమిచ్చారు. దాంతో ఆయన తన వద్ద ఉన్న మాస్కులను వారికి అందించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, కొవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన వారికి హితవు పలికారు.

కాగా, హరీశ్ రావు అక్కడున్నంతసేపు మాస్కుల్లేకుండా ఎవరైనా కనిపిస్తే వారికి మాస్కు అందించారు. అంతేకాదు, వారితో ఆప్యాయంగా మాట్లాడి సంతోషానికి గురిచేశారు.
Harish Rao
Masks
Chaitanyapuri
Hyderabad
Corona Virus

More Telugu News