Uttar Pradesh: యూపీలో 800 పాత చట్టాలను రద్దు చేసిన యోగి సర్కార్

  • ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆ రాష్ట్ర న్యాయ కమిషన్ చైర్మన్
  • 1,166 చట్టాలను రద్దు చేయాలంటూ సూచించామని వెల్లడి
  • ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందని కామెంట్
Yogi Government Repealed 800 Old Acts

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఒకటి కాదు రెండు కాదు.. 800 చట్టాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయ కమిషన్ చైర్మన్ ఎ.ఎన్. మిట్టల్ వెల్లడించారు. ఓ ఆంగ్ల సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు. 1,166 పాత చట్టాలతో అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించానని చెప్పారు. అందులో ఇప్పటిదాకా యోగి ప్రభుత్వం 800 చట్టాలను రద్దు చేసిందన్నారు. యోగి సర్కారుకు ముందు లా కమిషన్ లో కనీసం సిబ్బంది కూడా లేరన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాతే సిబ్బందిని తీసుకున్నామన్నారు.

కమిషన్ కు యోగి సర్కార్ నుంచి పూర్తి సహకారం అందుతోందని మిట్టల్ చెప్పారు. న్యాయ శాఖ ఉన్నా కూడా.. ముఖ్యమైన అంశాల గురించి కమిషన్ సలహాలు తీసుకుంటారని తెలిపారు. తామిచ్చిన 21 నివేదికల్లో 11 నివేదికలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఓ చట్టాన్ని తయారు చేయడానికి, అమలు చేయడానికి ముందు 20 నుంచి 25 మంది సీనియర్ అధికారులతో సీఎం యోగి సంప్రదింపులు జరుపుతారని, అంతా మంచిదే అని చెప్పాకే చట్టాలను అమలు చేస్తారన్నారు.

  • Loading...

More Telugu News