Ramesh Babu: మహాప్రస్థానంలో ముగిసిన రమేశ్ బాబు అంత్యక్రియలు

Ramesh Babu last rites concluded
  • కాలేయ సంబంధ అనారోగ్యంతో రమేశ్ బాబు మృతి
  • సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో తీరని శోకం
  • మహేశ్ బాబు ఇంటి ముందు నుంచే అంతిమయాత్ర
  • రమేశ్ బాబుకు అంత్యక్రియలు నిర్వహించిన కుమారుడు

నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్ బాబు అంత్యక్రియలు హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఈ మధ్యాహ్నం పూర్తయ్యాయి. రమేశ్ బాబు భౌతికకాయానికి కుమారుడు జయకృష్ణ అంతిమసంస్కారాలు నిర్వహించారు. రమేశ్ బాబు మృతితో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.

అంతిమయాత్రకు ముందు పద్మాలయా స్టూడియోస్ లో తనయుడి మృతదేహాన్ని చూసి కృష్ణ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, కరోనా సోకడంతో మహేశ్ బాబు తన సోదరుడ్ని కడసారి చూసేందుకు వీల్లేకపోయింది. మహేశ్ బాబు ఇంటి ముందు నుంచే అంతిమయాత్ర సాగింది. రమేశ్ బాబు కొంతకాలంగా లివర్ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడవడంతో వారి వేదన అంతాఇంతా కాదు.

  • Loading...

More Telugu News