పీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం.. పంజాబ్ ప్రభుత్వం మరో యాక్షన్
- ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ బదిలీ
- లూధియానా థర్డ్ ఐఆర్బీకి కమాండెంట్ గా నియామకం
- ఆయన స్థానంలో కొత్త ఎస్ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్
ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నాయి. స్వతంత్ర దర్యాప్తు కమిటీపై సోమవారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే నిన్న పంజాబ్ ప్రభుత్వం ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ హర్మన్ దీప్ సింగ్ హన్స్ ను బదిలీ చేసింది. హర్మన్ ను లూధియానాలోని థర్డ్ ఐఆర్బీకి కమాండెంట్ గా నియమించింది. ఆయన స్థానంలో ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్ ను నియమించింది.
కాగా, అంతకుముందు రాష్ట్ర డీజీపీనీ ప్రభుత్వం మార్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 9 మంది అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలున్నందున చాలా మంది అధికారుల అదనపు బాధ్యతలనూ తొలగించింది.