traffic: హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్

traffic restrictions in hyd vij
  • సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు
  • ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు బారులు
  • ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగమంచు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైద‌రాబాద్ నుంచి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున సొంత ఊళ్ల‌కు త‌ర‌లివెళ్తుండ‌డంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు బారులు తీరి క‌న‌ప‌డుతున్నాయి. దానికి తోడు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు క‌దులుతున్నాయి.

సాధారణంగా ఉండే ర‌ద్దీ కంటే వాహనాల రాకపోకలు భారీగా పెరగడంతో టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ట్యాక్స్‌ చెల్లింపు కేంద్రాలను పెంచారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు న‌డుపుతోంది. మొత్తం 4,360 బస్సులను ఏర్పాటు చేసి, వాటిలో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. మ‌రోవైపు, ఏపీ కూడా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది.
traffic
Hyderabad
Vijayawada

More Telugu News